YS Viveka Murder Case : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో కీలక సాక్షి అనుమానాస్పద మృతి

YS VIVEKHA

YS VIVEKHA

YS Viveka Murder Case : ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న వ్యక్తి మృతిచెందారు. హత్య కేసులో సాక్షిగా ఉన్న కల్లూరి గంగాధర్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఏపీలోని అనంతపురం జిల్లా యాడికిలోని ఆయన నివాసంలో బుధవారం మృతి చెందిఉన్నట్లు గుర్తించిన ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

YS Viveka Murder Case : గంగాధర్ రెడ్డి స్వస్థలం పులివెందుల. పదేళ్ల కిందట యాడికికి మారారు. అయితే వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉంటూ పలు నేరాలకు పాల్పడ్డారు. వివేకా హత్య కేసుకు సంబంధించి 2021 అక్టోబర్ లో సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. హత్య కేసును తన మీద వేసుకుంటే రూ.10కోట్లు ఇస్తానని శివశంకర్ చెప్పినట్లు గంగాధర్ రెడ్డి సీబీఐకి తెలిపారు. ఆ తర్వాత సీబీఐ అధికారులపైనే ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కాగా కొన్ని రోజులుగా వివేకా హత్య కేసు విచారణకు సంబంధించిన సీబీఐ… ఆధారాల సేకరణలో నిమగ్నమైంది. ఈ సమయంలో సాక్షిగా ఉన్న వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం చర్చనీయంగా మారింది.

Read Also : ఏపీలో పొత్తుల రాజకీయం.. రెండేళ్ల ముందు నుంచే..

Leave a Reply

Your email address will not be published.