పాలన చేతగాకపోతే దిగిపోవాలని.. అంతేకాని…

Achennaidu

ఏపీ సీఎం వైఎస్​ జగన్‌ అసమర్థ పాలనకు విద్యుత్‌ ఛార్జీల పెంపు నిదర్శనమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్నడు లేనివిధంగా విద్యుత్‌ ఛార్జీలను పెంచిన ఘనత జగన్‌దేనని విమర్శించారు. తన చేతగానితనంతో ఓ వైపు విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ మరోవైపు ప్రజలపై పెనుభారం మోపుతున్నారని మండిపడ్డారు. పాలన చేతగాకపోతే దిగిపోవాలని.. అంతేకాని పన్నులు, ఛార్జీలు పెంచుతూ ప్రజలను దోచుకోకూడదని అన్నారు. స్విచ్ వేయకుండానే ప్రజలను జగన్‌ కరెంట్​ షాక్‌లకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published.