Social Media Ban in Srilanka: లంకలో సోషల్ మీడియా బ్యాన్.. ఆ తర్వాత!

social media

Social Media Ban in Srilanka: తీవ్ర సంక్షోభంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా అత్యవసర స్థితిని ప్రకటించిన శ్రీలంక గవర్నమెంట్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో నిరసనలను అడ్డుకునేందుకు సోషల్ మీడియాపై బ్యాన్ విధించింది. ఈ నిషేధంతో వాట్సాప్, ట్విట్టర్, టిక్‌టాక్, యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సహా పదుల సంఖ్యలో సోషల్‌ మీడియా సేవలు నిలిచిపోనున్నాయి. ఆహార, ఆర్థిక సంక్షోభం, పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో లంకేయలు తీవ్ర గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నారు. శనివారం నుంచి సోమవారం వరకు గొటబాయ ప్రభుత్వం శ్రీలంక వ్యాప్తంగా 36 గంటల కర్ఫ్యూ విధించింది. ప్రజల భద్రత పేరుతో శ్రీలంక ప్రభుత్వం అత్యవసరస్థితి ప్రకటించడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని లండన్‌కు చెందిన హక్కుల సంస్థ తెలిపింది.

అనంతరం ఎత్తివేత…

Social Media Ban Lifted in Srilanka: శ్రీలంకలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న…. నిరసనలకు అడ్డుకట్ట వేసేందుకు సామాజిక మాధ్యమాలపై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో వాట్సాప్, ట్విట్టర్, యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సహా పదుల సంఖ్యలో సామాజిక మాధ్యమాల సేవలు 15 గంటల తర్వాత తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రజలు భద్రత పేరుతో గొటబాయ ప్రభుత్వం శ్రీలంకవ్యాప్తంగా 36 గంటల పాటు కర్ఫ్యూ విధించింది. కర్ఫ్యూను నిరసిస్తూ వందలాది మంది ప్రజలు రోడ్లపై ఆందోళనకు దిగారు.ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు వారిపై వాటర్‌ కెనాన్స్‌ను ప్రయోగించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజాగ్రహాన్ని తగ్గించేందుకు సామాజిక మాధ్యమాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ శ్రీలంక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Leave a Reply

Your email address will not be published.