Halfday Schools in AP: ఇవాళ్టి నుంచి ఏపీలో ఒంటిపూట బడులు

School Holiday in puducherry
Halfday Schools in AP: వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా ఇవాళ్టి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఒంటి పూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు తరగతులు నిర్వ హించాలని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనం అనంతరం విద్యార్థులను ఇంటికి పంపాలన్నారు. ఈనెల 27 నుంచి పదో తరగతి పరీక్షలు ఉన్నందున పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, జిల్లా విద్యాశాఖాధికారి ప్రణాళిక ప్రకారం విద్యార్థులకు ప్రత్యేక తరగ తులు నిర్వహించాలని సూచించారు.