బాక్స్ ఆఫీస్‌ను ఆర్ఆర్ఆర్ ర్యాంప్ ఆడింది… కలెక్షన్ల సునామీ అంటే ఇదే!

RRR Day 1 Collections : దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా బాక్స్ ఆఫీస్‌లను బద్ధలు చేస్తోంది. వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. తన రికార్డులను తానే తిరగరాసుకున్నారు రాజమౌళి. బాహుబలి సినిమా రికార్డులను చెరిపేసింది. విడుదలైన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.223 కోట్లు వసూలు చేసింది. భారతదేశంలో రూ.156 కోట్లు వసూలు చేసింది. యుఎస్, కెనడా నుంచి మరో రూ.42 కోట్లు రాబట్టింది. బాహుబలి 2 మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.217 కోట్లు వసూలు చేసింది. ఆ రికార్డులను ఆర్ఆర్ఆర్ బద్ధలు కొట్టింది.
RRR Day 1 Collections : ఆర్ఆర్ఆర్ ఇప్పుడు నం.1 ఇండియన్ సినిమా ఓపెనర్. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ.223 కోట్లు వసూలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో రూ.75 కోట్లు, నైజాం ప్రాంతంలో రూ.27.5 కోట్లు, కర్ణాటకలో రూ.14.5 కోట్లు, తమిళనాడులో రూ.10 కోట్లు వసూలు చేసింది. నార్త్ ఇండియాలో రూ.25 కోట్లు రాబట్టింది. ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది.
రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్‌గా దర్శకదీరుడు రాజమౌళి తీశారు. కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజుల జీవితాల ఆధారంగా కల్పిత కథతో సినిమాను రాజమౌళి తీశారు. ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా, రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా యాక్ట్ చేశారు. ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. బాలీవుడ్ నటి ఆలీయా భట్, హాలీవుడ్ బామ ఒలివియా మోరిస్, బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్, సుముద్రఖని కీలక పాత్రలు పోషించారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైంది.