TSLPRB Police Constable : పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్లు విడుదల

neet exams

neet exams

తెలంగాణలో కానిస్టేబుల్ ప్రిలిమినరి ఎగ్జామ్ హాల్ టికెట్లు నేడు విడుదలయ్యాయి. గురువారం ఉదయం 8గంటల నుంచి ఈనెల 26 రాత్రి 12గంటల వరకు డౌన్​లోడ్ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ నెల 28న పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

పోలీస్ శాఖలో 15,644, అబ్కారీ శాఖలో 614, రవాణా శాఖలో 63 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ వెలువడగా.. 6,61,196 మంది పరీక్షకు హాజరు కానున్నారు. ఈనెల 28న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ప్రిలిమ్స్ పరీక్షలు జరుగుతాయని.. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,601 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పోలీసు నియామక మండలి ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావు తెలిపారు.

అభ్యర్థులు.. ఈ విషయాలను పరిశీలించండి..
అభ్యర్థులు హాల్ టికెట్ డౌన్​లోడ్ ప్రక్రియలో ఏదైనా ఇబ్బంది ఎదురైతే support@tslprb.inను సంప్రదించాలని లేదంటే 9393711110, 9391005006కు ఫోన్ చేయాలని సూచించారు. హాల్ టికెట్ ను కలర్​లోనే తీసుకోవాలనే నిబంధన ఏమీ లేదు. అయితే అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలు కూడా ఫ్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్​ సమయంలో ఇచ్చిన ఫోటోను హాల్ టికెట్ పై అతికించాల్సి ఉంటుంది. ఒక్కనిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతి ఉండదు.

Leave a Reply

Your email address will not be published.