పెరిగిన పెట్రోల్ ధరలు… ఇలా అయితే ఎట్లరా అయ్యా!

petrol-diesel-price

petrol-diesel-price

Petrol Diesel Prices Hike: దేశంలో పెట్రో ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోల్‌, డీజిల్‌పై 80 పైసల చొప్పున పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్ ధర 98 రూపాయల 61 పైసలకు చేరగా, డీజిల్‌ ధర 89 రూపాయల 87 పైసలకు పెరిగింది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ 111 రూపాయల 80 పైసలకు చేరగా.. డీజిల్‌ 98 రూపాయల 10 పైసలకు పెరిగింది. విజయవాడలో పెట్రోల్‌ 113 రూపాయల 62 పైసలు, డీజిల్‌ 99 రూపాయల 56 పైసలకు పెరిగింది. గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ 113 రూపాయల 83 పైసలు, డీజిల్‌ 99 రూపాయల 76 పైసలకు చేరింది. అయిదు రోజుల వ్యవధిలో పెట్రోల్​ ధరలు నాలుగుసార్లు పెరిగాయి. ఈ నాలుగు రోజుల్లో మొత్తం 3 రూపాయల 20 పైసలు పెట్రోల్‌ ధరలు (Petrol Diesel Prices Hike) పెరిగాయి.

పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలకు వ్యతిరేకంగా పోరుబాట పట్టాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఈ నెల 31న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా తెలిపారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు ప్రజలంతా గంట లేదా డ్రమ్‌ మోగించి నిరసన తెలపాలని సూచించారు. ధరల పెరుగుదల ముక్త భారత్‌ కోసం పోరాటం చేస్తామని వెల్లడించారు. యూపీఏ హయాంలో అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గితే దేశంలో కూడా తగ్గించామని, ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం దాన్ని పాటించకుండా ప్రజలను దోచుకుంటోందని సూర్జేవాలా విమర్శించారు. మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 7 వరకు మొత్తం మూడు విడతల్లో ఆందోళనలు చేపడతామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.