ప్రజలు అధికారం ఇచ్చింది.. ఆ పనులు చేయడానికి కాదు: నారా లోకేష్​

nara lokesh

nara lokesh

ఏపీ సీఎం జగన్​పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్​ మండిపడ్డారు. రాష్ట్రాన్ని రావణకాష్టం చేయడానికి జగన్​, ఆయన పార్టీ నేతలు కంకణం కట్టుకున్నారని విమర్శించారు. ప్రజలు అధికారం ఇచ్చింది.. క‌బ్జాలు, దోపీడీలు, అడ్డుప‌డిన‌వారిని చంప‌డానికి లైసెన్సు అన్నట్లు దారుణాల‌కు తెగ‌బ‌డుతున్నారని మండిపడ్డారు.
చిత్తూరు జిల్లా కురబలకోట మండలం కొంగావారిపల్లికి చెందిన గాజుల వ్యాపారి రమణమ్మని ఆర్థిక వ్యవహారంలో ఏర్పడిన వివాదంతో వైసీపీ నేత ఎన్.వెంకట్రమణారెడ్డి అతి దారుణంగా కొట్టి చంప‌డం రాష్ట్రంలో వైసీపీ దండుపాళ్యం గ్యాంగ్ అరాచ‌కాల‌కి ప‌రాకాష్ట అంటూ నారా లోకేష్​ ట్వీట్​ చేశారు.

జ‌గ‌న్‌రెడ్డి దిశ వాహ‌నాలకి జెండా ఊపి ప్రారంభించి… మ‌హిళ‌ల భ‌ద్రతకు తనది భ‌రోసా అని మాయ‌మాట‌లు చెప్పి మూడురోజులు కాలేదని… ఇప్పుడు వైసీపీకి చెందిన వెంకట్రమణారెడ్డి ఓ మ‌హిళ‌ని అత్యంత పాశ‌వికంగా కొట్టి చంపేశాడని ఆరోపించారు. ఇదేనా మ‌హిళ‌ల‌కు ముఖ్యమంత్రి ఇచ్చే భ‌ద్రత‌ అని ప్రశ్నించారు. అండ‌గా నిల‌వాల్సిన‌ ప్రభుత్వమే అంత‌మొందిస్తుంటే, న్యాయం చేయాల్సిన పోలీసులు అన్యాయంగా వ్యవ‌హ‌రిస్తుంటే..రాష్ట్ర ప్రజల ప్రాణాల‌కు దేవుడే దిక్కని లోకేష్​ అన్నారు.

Leave a Reply

Your email address will not be published.