Metro Super Saver Card: ఇవాళ్టి నుంచి అందుబాటులోకి మెట్రో సూపర్ సేవర్ కార్డ్

Metro Super Saver Card: సెలవు రోజుల్లో అపరిమిత ప్రయాణానికి హైదరాబాద్ మెట్రో రైలు ప్రకటించిన సూపర్ సేవర్ ఆఫర్‌ ఇవాళ్టి నుంచి అందుబాలోకి వచ్చింది. సెలవు రోజుల్లో 59 రూపాయలతో రోజంతా మెట్రోలో ఎన్నిసార్లైనా ప్రయాణించే వెసులుబాటు ప్రయాణికులు వినియోగించుకుంటున్నారు. మెట్రో రైల్ టిక్కెట్ కౌంటర్ల వద్ద సూపర్ సేవర్ కార్డులను విక్రయాలు చేస్తున్నారు. ఈ కార్డుతో హైదరాబాద్ జంట నగరాల్లోని 57 మెట్రో స్టేషన్ల నడుమ ఒక రోజులో అపరిమితమైన సార్లు తిరగవచ్చు.

Metro Super Saver Card: సంవత్సరంలో వర్తించే 100 సెలవు దినాల్లో మాత్రమే ఈ సూపర్ సేవర్ కార్డు అందుబాటులో ఉంటుంది. మెట్రోరైల్ ప్రయాణీకులు సూపర్ సేవర్ కార్డు కోసం మొదటి సారి… తిరిగి చెల్లించే వీలులేకుండా 50 రూపాయలతో కార్డును తీసుకోవాలి. అనంతరం 59 రూపాయల రీఛార్జీ చేసుకోవడం ద్వారా కార్డు పొందవచ్చని మెట్రో వర్గాలు తెలిపాయి. ప్రతి ఆదివారం, ప్రతి రెండో, నాలుగో శనివారం, ఇతర పండగల రోజులు, సెలవు దినాల్లో ఆఫరు వర్తింస్తుందని మెట్రో అధికారులు తెలిపారు.

పూర్వ వైభవం కోసం…

Hyderabad Metro Rail: కరోనాతో ఆర్థిక కష్టాల్లో ఉన్న హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికుల సంఖ్య పెంపు కోసం కృషి చేస్తోంది. కరోనా తగ్గినా ఇప్పటి వరకు రోజుకు 2.70 లక్షల ప్రయాణికులు మాత్రమే మెట్రోను ఆశ్రయిస్తున్నారు. దీంతో గత వైభవాన్ని తీసుకోచ్చేందుకు… ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు ఆఫర్లు ప్రకటించింది. రానున్న ఆర్థిక సంవత్సరంలో రోజుకు 5 నుంచి 6 లక్షల వరకు ప్రయాణీకులను గమ్యస్థానానికి చేర్చడమే తమ లక్ష్యమని మెట్రో అధికారులు వెల్లడించారు. సెలవు రోజుల్లో అపరిమిత ప్రయాణ అవకాశాలను అందించేందుకు సూపర్ సేవర్ ఆఫర్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. సెలవు రోజుల్లో 59 రూపాయలతో రోజంతా మెట్రోలో ఎన్నిసార్లైనా ప్రయాణించవచ్చని మెట్రో అధికారులు వివరించారు.

Leave a Reply

Your email address will not be published.