Lovers Romance on Bike Riding: బైక్‌పై రొమాన్స్.. అర్జున్ రెడ్డి సీన్ రిపీట్!

Lovers Romance on Bike Riding: అర్జున్ రెడ్డి సినిమా సీన్ కర్ణాటక రాష్ట్రంలో రిపీట్ అయింది. ఆ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ శాలిని మధ్య వచ్చే రొమాంటిక్ బైక్ సీన్ ప్రేక్షకులను అలరించింది. అదే తరహాలో కర్ణాటక స్టేట్‌లో ఇద్దరు ప్రేమికులు సీన్‌ను రిపీట్ చేశారు. ఈ ప్రేమ జంట నడిరోడ్డుపై హల్‌చల్ చేసింది. ఓ యువకుడు పల్సర్ బైక్ పెట్రోల్ ట్యాంక్‌పై ప్రియురాలిని కూర్చోపెట్టుకుని రైడ్‌కు వెళ్లాడు. గట్టిగా ఒకరినొకరు హత్తుకుని రోడ్డుపై ప్రయాణించారు.

Lovers Romance on Bike Riding: లారీలు, బస్సులు తమకేవీ అడ్డుకావన్నట్టుగా నడిరోడ్డుపై దూసుకెళ్లారు. ప్రియురాలి ముద్దుల్లో మునిగిపోయిన ప్రియుడు బండి ఎలా నడుపుతున్నాడో కూడా మర్చిపోయాడు. ఇద్దరు గాల్లో తేలారు. వీరిద్దరి రొమాంటిక్‌ రైడ్‌ను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే ఒక్కసారిగా వీరిద్దరూ ఫేమస్ అయిపోయారు. వీరి వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. బైక్‌పై చామరాజనగర్ జిల్లా రిజిస్ట్రేషన్ నంబర్ ఉండడంతో… ఈ ప్రేమజంట ఆ ప్రాంతానికే చెందినవారని తెలుస్తోంది. బైక్‌పై ఉన్న వ్యక్తి హెచ్‌డీ కోటేకు చెందిన స్వామిగా గుర్తించినట్లు సమాచారం. ఈ లవర్స్ వీడియోకు నెటిజన్లు విపరీతంగా కమెంట్స్ పెడుతున్నారు. కలికాలం అని ఒకరంటే…. బాబోయ్ అర్జున్‌రెడ్డి అంటూ మరొకరు ఇలా కమెంట్స్ వర్షం కురిస్తున్నారు.

ఎంత ఘాటు ప్రేమయో!

బైక్‌పై రొమాన్స్.. అర్జున్‌రెడ్డి సీన్ రిపీట్! కర్ణాటకలో ఇద్దరు లవర్స్ బైక్‌పై చేసిన రొమాన్స్ హాట్‌టాపిక్‌గా మారింది. బైక్‌పై రొమాన్స్ చేస్తూ వెళ్తున్న వీరిని చూసి ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అయింది.

Leave a Reply

Your email address will not be published.