అమలాపురం ఘర్షణలకు వైకాపా వాళ్లే కారణం: పవన్ 

pawan

కోనసీమ జిల్లా పేరు మార్పు, అమలాపురంలో మంగళవారం జరిగిన అల్లర్లపై జనసేనాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఘర్షణలకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలోనే కోనసీమ జిల్లాకు అంబేడ్కర్​ పేరుపెడితే బాగుండేదని.. కానీ ప్రభుత్వం జాప్యం చేసిందన్నారు. ఫలితంగానే పరిస్థితి అదుపుతప్పిందన్నారు. మంత్రి విశ్వరూప్​ ఇంటిపై దాడి జరగడానికి ముందే ఆయన కుటుంబ సభ్యులను సురక్షితంగా తరలించారన్న పవన్​.. దాడి జరుగుతుందనే సమాచారం ముందే ఉందని.. కానీ అదనపు బలగాలు మోహరించకుండా తాత్సారం చేశారని మండిపడ్డారు. దాడి సమయంలో పోలీసులు కేవలం ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారని నిలదీశారు. సున్నితంగా వ్యవహరించాల్సిన చోట కుల రాజకీయాలు చేసారా అని నిలదేశారు. ప్రభుత్వం వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొనేందుకే ప్రతిపక్షాలపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వారే కారణం..?
అమలాపురం ఘర్షణలో కీలకంగా వ్యవహరించిన అన్యం సాయి వైకాపా నేతేనని పవన్​ స్పష్టం చేశారు. సాక్షాత్తు రాష్ట్ర హోంశాఖ మంత్రి విపక్షాలపై నిందలు వేస్తారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల, మంత్రి విశ్వరూప్​తో అన్యం సాయి ఉన్న ఫోటోలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విడుదల చేసినట్లు జనసేనాని తెలిపారు. కోనసీమ జిల్లా ప్రజలు సంయమనం పాటించాలని పవన్​ కల్యాణ్​ కోరారు. అంబేడ్కర్​ మండి మహనీయుడిని ఒక జిల్లాకు పరిమితం చేస్తారా.. రాజకీయ లబ్దికోసం మహనీయుడు పేరును వాడుకుంటున్నారని మండిపడ్డారు. కోనసీమ జిల్లాకు పేరుపెట్టే విషయంలో రిఫరెండం పెట్టాలని డిమాండ్​ చేశారు. ప్రజల అభిప్రాయలను తీసుకోవాలని సూచించారుయ

Leave a Reply

Your email address will not be published.