ప్రముఖ హీరోలకు జరిమానా… ఎందుకంటే?

బోధన్‌‌ ఎమ్మెల్యే షకీల్‌‌ పేరుతో కారు‌‌ స్టిక్కర్‌‌ ఇష్యూతో హైదరాబాద్ స్పెషల్ డ్రైవ్​ చేపడుతున్నారు. ఎటువంటి అనుమతి లేకుండా వెహికిల్స్​కు నకిలీ స్టిక్కర్లు, బ్లాక్​ ఫిల్మ్స్​ అతికించుకుని తిరుగుతున్న వారిపై కొరఢా ఝుళిపిస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, పోలీస్‌, ప్రెస్‌, ఆర్మీ వంటి స్టిక్కర్లను వాహనాలపై అతికిస్తూ తిరుగుతున్న వారిపై పోలీసులు ఫోకస్​ పెట్టారు. అనుమతులు లేకుండా ఈ స్టిక్కర్లను అతికించుకుని తిరుగుతున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. అలాగే అద్దాలకు బ్లాక్​ ఫిల్మ్​ ఉంచుకుని తిరుగుతున్న వాహనదారులపై కూడా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. బ్లాక్​ ఫిల్మ్​తో పట్టుబడిన వాహనాలకు అక్కడే వాటిని తొలగిస్తున్నారు. అంతే కాకుండా జరిమానాలు విధిస్తున్నారు.

జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్​ 36లోని నీరుస్​ చౌరస్తాలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న అల్లు అర్జున్​, కల్యాణ్ రామ్​ కార్లను పోలీసులు ఆపారు. వాటికి ఉన్న బ్లాక్ ఫిల్మ్​లను తొలగించారు. దీంతో పాటు ఇద్దరికి రూ.700 చొప్పున జరిమానా విధించారు. వరోవైపు నకిలీ పోలీస్​, ఆర్మీ, ప్రెస్‌ అని స్టిక్కర్లు అతికించుకుని తిరుగుతున్న వాహనాలను కూడా పోలీసులు తనిఖీ చేశారు. హైదరాబాద్​ సిటీలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. వారికి ఫైన్​లు విధించారు. పర్మిషన్​ లేకుండా ఈ స్టిక్కర్లు అతికించుకుంటే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.