Rains In AP : బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీకి రెండు రోజులు వర్ష సూచన

cyclone-rain

cyclone-rain

Rains In AP : కుళ్లిన పంటలు, కూలుతున్న ఇళ్లు, బురదమయమైన రహదారులు, ఎడతెరపని కష్టాలతో ఇక్కట్లు పడుతున్న ప్రజలకు వాతావరణశాఖ మరో పిడుగు లాంటి వార్త చెప్పింది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Rains In AP : ఉత్తరకోస్తా, దక్షిణకోస్తా, రాయలసీమలోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు, పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇక ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి సహా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మరోవైపు గోదావరి వరద ప్రవాహం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ముంపు ప్రాంత వాసులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి ప్రవహిస్తోంది. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాలను మరళా వరద నీరు ముంచెత్తడంతో ముంపు ప్రాంత వాసులు ప్రాణాలు అరచేత పట్టుకుని పునరావాస కేంద్రాలకు తరలిపోతున్నారు.

Read Also: Psycho Killer : భార్యను అలా చూసిన ఓ వ్యక్తి.. సైకో కిల్లర్​గా మారి హత్యలు..!

Leave a Reply

Your email address will not be published.