సోనియా, రాహుల్​గాంధీలకు ఈడీ షాక్​!

sonia and rahul gandhi

కాంగ్రెస్​ అధినేత్రి సోనియాగాంధీ, ఆ పార్టీ సీనియర్​ నేత రాహుల్​ గాంధీకి ఈడీ షాక్​ ఇచ్చింది. నేషనల్​ హెరాల్డ్ కేసులో ఈనెల 8న తన ఎదుట హాజరుకావాలంటూ ఇద్దరు నేతలకు సమన్లు జారీచేసింది. నేషనల్​ హెరాల్డ్​ కేసులో వారి స్టేట్​మెంట్లను రికార్డు చేసేందుకు సమన్లు ఇచ్చినట్లు ఈడీ అధికారులు తెలిపారు. దీనిపై కాంగ్రెస్​ పార్టీ తీవ్రంగా స్పందించింది. పిరికిపంద చర్యగా పేర్కొన్న కాంగ్రెస్​… తమ నేతలు ఈడీ ఎదుట హాజరవుతారని వెల్లడించారు.


నేషనల్​ హెరాల్డ్​ ఆస్తులను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం వెనుక మోసపూరిత కుట్ర ఉన్నాయని భాజపా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్​ వేశారు. దీని ఆధారంగా ఈడీ మనీలాండరింగ్​ చట్టం కింద కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్​ గాంధీ, శ్యామ్​ పిట్రోడా, సుమన్​ దుబే, అస్కార్​ ఫెర్నాండేజ్​ సహా ఏడుగురు ఉన్నారు. ఈ కేసులో ఇటీవలే మల్లికార్జున్​ ఖర్గే, పవన్​ బన్సాల్​ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published.