ఎర్రన్నాయుడు స్మారక చిల్డ్రన్స్ పార్కును కూల్చేసిన దుండగులు

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఎర్రన్నాయుడు స్మారక చిల్డ్రన్స్ పార్కును శనివారం తెల్లవారుజామున కూల్చివేశారు. 2014లో పర్యాటకశాఖ నిధులతో ఈ పార్కును ప్రభుత్వం నిర్మించింది. కొందరు పార్కు స్థలాన్ని ఆక్రమించుకునేందుకు అర్ధరాత్రి తరువాత కూల్చివేశారు. సమచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రెండు యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆరోపించారు. ఎర్రన్నాయుడు చిల్డ్రన్స్ పార్క్ కూల్చివేతపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

ఉప ముఖ్యమంత్రి కృష్ణ దాస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్తులు కూల్చివేయడం అన్యాయమని అన్నారు. తక్షణమే దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు. ఎర్రన్నాయుడు చిల్డ్రన్స్ పార్క్ కూల్చివేతపై టీడీపీ నేతలు ధర్నా చేపట్టారు. పోలీసుల తీరు పట్ల మండిపడ్డారు. పార్కును కూల్చివేసిన వ్యక్తులను పోలీసులు రక్షించడం అన్యాయమని అన్నారు. కూల్చివేసిన పార్కు ఆవరణలో ధర్నా చేశారు. బాధ్యులైన వారిని శిక్షించాలని డిమాండ్​ చేశారు.

Leave a Reply

Your email address will not be published.