కాంగ్రెస్​కు భారీ షాక్​.. కపిల్​ సిబల్​ రాజీనామా

kapil sibal

2014 కాంగ్రెస్​ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఒక్కొక్క రాష్ట్రాన్ని చేజార్చుకున్న హస్తం పార్టీ.. చాలా రాష్ట్రాల్లో ప్రభావం కోల్పోయింది. రాజస్థాన్​లో నిర్వహించిన చింతన్​ శిబిర్​ కార్యక్రమం అనంతరం పార్టీ పరిస్థితి మెరుగుపడుతుందని ఆ పార్టీ నేతలు భావించారు. కానీ అందుకు భిన్నంగా పార్టీ కీలక నేతలు గుడ్​బై చెప్పారు. తొలుత పంజాబ్​కు చెందిన సీనియర్​ నేత సునీల్​ జాఖర్​ కాంగ్రెస్​కు రాజీనామా చేసిన భాజపా తీర్థం పుచ్చుకున్నారు. గుజరాత్​లో కీలకనేత హార్దిక్​ పటేల్​ పార్టీకు గుడ్​బై చెప్పారు.

గట్టి షాక్..
తాజాగా గట్టి షాక్​ తగిలింది. ప్రముఖ న్యాయవాది, పార్టీ సీనియర్​ నేత కపిల్​ సిబల్​ హస్తం పార్టీకి రాజీనామా చేశారు. సమాజ్​వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్​ యాదవ్​ సమక్షంలో రాజ్యసభకు నామినేషన్​ దాఖలు చేశారు. మే 16నే కాంగ్రెస్​కు రాజీనామా చేసినట్లు.. నామినేషన్​ అనంతరం సిబల్​ వెల్లడించారు. ఎప్పటినుంచో రాజ్యసభలో స్వతంత్రంగా వ్యవహరించాలని భావిస్తున్నట్లు చెప్పారు. తాను ఇండిపెండెంట్​గానే నామినేషన్​ వేసినట్లు చెప్పిన కపిల్​ సిబల్​.. తనకు ఎస్పీ మద్దతు ఇస్తుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.