CM Jagan Delhi Tour: రేపు ఢిల్లీకి సీఎం జగన్… ప్రధానితో భేటీ

CM Jagan Delhi Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రేపు దేశ రాజధాని ఢిల్లీ వెళ్తున్నారు. మంగళవారం సాయంత్రం 4గంటల 30 నిమిషాల సమయంలో ప్రధాని నరేంద్రమోడీతో… సీఎం జగన్ భేటీ అవుతారు. కొత్త జిల్లాలు, రాష్ట్రానికి నిధుల విషయంపై ప్రధానితో చర్చించనున్నారు. పోలవరం సహా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపైనా మాట్లాడనున్నారు. అంశాలపై ప్రధానికి విజ్ఞాపనలు అందజేయనున్నారు. ప్రధానితో భేటీ తర్వాత… కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం కోసం ముఖ్యమంత్రి జగన్ అపాయింట్మెంట్ కోరారు.
కొత్త జిల్లాల ప్రారంభం..
New Districts in AP: కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభమైంది. రాష్ట్రంలో జిల్లాల సంఖ్య… 13 నుంచి 26కు పెరిగింది. ముఖ్యమంత్రి జగన్ వర్చువల్ విధానంలో జిల్లాలను ప్రారంభించారు. పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ అవసరం మేరకే కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని సీఎం జగన్ చెప్పారు. గ్రామాల నుంచి రాజధాని వరకు వికేంద్రీకరణే తమ విధానమని స్పష్టం చేశారు. కొత్త జిల్లాల వల్ల ప్రజలకు మరింత మెరుగైన పాలన అందుతుందన్నారు.