Nagababu Reacts on Pub Case: ‘నా కూతురికి ఎలాంటి సంబంధం లేదు.. షీ ఈజ్ క్లియర్’

Nagababu Reacts on Pub Case: రాడిసన్ బ్లూ హోటల్ పబ్ డ్రగ్స్ కేసులో తన కూతురు కొణిదెల నిహారికకు ఎలాంటి సంబంధం లేదని సినీనటుడు నాగబాబు స్పష్టం చేశారు. నిన్న రాత్రి తన కుమార్తె అక్కడ ఉన్న మాట వాస్తమేనని ఆయన తెలిపారు. పరిమిత సమయానికి మించి రాడిసన్ పబ్ కొనసాగడం వల్ల పోలీసులు చర్యలు తీసుకున్నారని తెలిపారు. అయితే ఈ విషయంలో నిహారికకు ఎలాంటి తప్పు లేదని పోలీసులు తెలిపారని వెల్లడించారు. ఈ కేసుపై సోషల్ మీడియా, మొయిన్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారని నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అసత్య ప్రచారం వద్దని విజ్ఞప్తి చేస్తూ ఆయన ప్రత్యేక వీడియో విడుదల చేశారు.
నిన్న రాత్రి రైడింగ్…
Nagababu Reacts on Pub Case: ఇదిలా ఉండగా… నిన్న రాత్రి బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ పబ్‌లో డ్రగ్స్ కలకలంరేగింది. ఈ ఘటనలో మెగాహీరోయిన్ కొణిదెల నిహారిక, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అక్కడే ఉన్నారు. వీరితో పాటుగా సినీ ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా 150 మందికి పైగా అక్కడ ఉన్నట్లు వీళ్లందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల ప్రత్యేక దృష్టి…
Police Focus on Radisson Pub Case:పబ్‌లో డ్రగ్స్ బయటపడం.. అందులో ప్రముఖులు ఉండటంతో పోలీసులు .. ఈ కేసుపై ప్రత్యేక దృష్టిసారించారు. నిబంధనలకు మించి పబ్ నడిపినందుకు కేసు నమోదు చేశారు. నార్కొటిక్ కంట్రోల్ వింగ్ సహా మూడు బృందాలు ఘటనపై దర్యాప్తు చేస్తున్నాయి. పబ్ మేనేజర్‌ను సిబ్బందిని పోలీసులు విచారిస్తున్నారు. పబ్‌లో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అదుపులోకి తీసుకున్నవారిలో అనుమానితుల కాల్‌డేటాను పరిశీలిస్తున్నారు. డ్రగ్స్ ఎక్కడినుంచి వచ్చాయో తమకు తెలియదని పబ్ నిర్వాహకులు పోలీసులకు వివరించినట్లు సమాచారం. దీంతో క్లూస్ టీం ద్వారా పబ్‌లో వివరాలు సేకరిస్తున్న పోలీసులు… సాంకేతిక అంశాలతో దర్యాప్తు చేస్తున్నారు.
డ్రగ్స్ తీసుకున్నట్లు తేలలేదు…
Westzone DCP On Pub Case: రాడిసన్ బ్లూ పబ్‌లో ఉన్నవారు డ్రగ్స్ తీసుకువచ్చినట్లు, వినియోగించినట్లు తేలలేదని వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. డ్రగ్స్ కేసులో పబ్‌లో ఉన్నవారిని బాధ్యులను చేయలేదని ఆయన స్పష్టం చేశారు. పబ్‌లో ఉన్నవారి పాత్ర ఉందని దర్యాప్తులో తేలితే అరెస్టు చేస్తామని డీసీపీ వివరించారు. పబ్‌లో ఉన్న అందరి వివరాలు తీసుకున్నామని డీసీపీ జోయల్ డేవిస్ పేర్కొన్నారు. పుడింగ్ అండ్ మింక్ యజమాని అర్జున్, అభిషేక్‌పై కేసులు పెట్టినట్లు తెలిపారు. డ్రగ్స్‌కు సంబంధించి జనరల్ మేనేజర్ అనిల్‌పైనా కేసు పెట్టామన్నారు.