AP New Cabinet : ఏపీ మంత్రులకు కేటాయించిన శాఖలివే!

Compassionate Appointments

Ap New Cabinet :ఏపీ సీఎం జగన్ కొత్త జట్టు కొలువుదీరింది. కొత్త మంత్రులతో గవర్నర్‌ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. చాలా మంది మంత్రులు తెలుగులోనే ప్రమాణం చేయగా.. కొందరు ఆంగ్లంలో చేశారు. ప్రమాణం తరవాత పలువురు మంత్రులు సీఎం జగన్‌కు పాదాభివందనం చేశారు. మంత్రులకు శాఖలు కేటాయించారు. మరోసారి ఐదుగురిని ఉపముఖ్యమంత్రులుగా నియమించారు. పి.రాజన్నదొర, కె.నారాయణస్వామి, బూడి ముత్యాలనాయుడు, కె.అంజాద్ బాషా, కొట్టు సత్యనారాయణకు డిప్యూటీ సీఎం హోదా కల్పించారు.

Ap New Cabinet : ధర్మాన ప్రసాదరావు – రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు
సీదిరి అప్పలరాజు – పశుసంవర్ధక, మత్స్యశాఖ
బొత్స సత్యనారాయణ – విద్యాశాఖ
రాజన్నదొర – ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ
గుడివాడ అమర్నాథ్‌ – పరిశ్రమలు, ఐటీ శాఖ
బూడి ముత్యాలనాయుడు-ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ
దాడిశెట్టి రాజా – రహదారులు, భవనాలశాఖ
పినిపే విశ్వరూప్ – రవాణా శాఖ
శ్రీనివాస వేణుగోపాల్ కృష్ణ – బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ, సమాచార పౌరసంబంధాలు
తానేటి వనిత – హోంశాఖ
కారుమూరి నాగేశ్వరరావు – పౌరసరఫరాలశాఖ
కొట్టు సత్యనారాయణ – ఉపముఖ్యమంత్రి, దేవదాయశాఖ
జోగి రమేష్‌ – గృహనిర్మాణ శాఖ
మేరుగు నాగార్జున – సాంఘిక సంక్షేమశాఖ
విడదల రజని – వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ
అంబటి రాంబాబు – జలవనరుల శాఖ
ఆదిమూలపు సురేశ్‌ – పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ
కాకాణి గోవర్ధన్ రెడ్డి – వ్యవసాయం, సహకార, మార్కెటింగ్ శాఖ
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి – గనులు, అటవీ, ఇంధన, సైన్స్ అండ్ టెక్నాలజీ
ఆర్‌.కె.రోజా – పర్యాటక, యువజన, క్రీడల శాఖ
కె.నారాయణ స్వామి – ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్‌ శాఖ
అంజాద్ బాషా – ఉపముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమశాఖ
బుగ్గన – ఆర్థిక, శాసనసభ వ్యవహారాలు, ప్రణాళిక శాఖ
గుమ్మనూరు జయరాం – కార్మిక శాఖ
ఉషశ్రీ చరణ్ – మహిళా శిశుసంక్షేమశాఖ

Leave a Reply

Your email address will not be published.