గంటపాటు ఎర్త్ అవర్… అవన్నింటిని స్విచ్ ఆఫ్ చేయండి

ఏటా మార్చి 26న రాత్రి గంటపాటు విద్యుత్‌ను నిలిపివేసి ఎర్త్ అవర్‌ను నిర్వహిస్తారు. దీని ద్వారా భూమికి కొంతైనా ఉపశమనం కలిగుతుందని పర్యావరణ నిపుణులు అంటున్నారు. ఇప్పటికే దీనిపై అవగాహన కల్పిస్తున్నారు. టీవీ, సోషల్ మీడియా ద్వారా ఎర్త్ అవర్ పై అవగాహన కల్పిస్తున్నారు. ఇవాళ రాత్రి 8.30 నుంచి గంట పాటు ఎర్త్ అవర్‌ను నిర్వహించనున్నారు. ఎర్త్ అవర్ ఉద్యమానికి సంఘీభావంగా ఇంట్లో కరెంట్, కర్భన ఉద్గారాలను గంటపాటు ఆపేయాలి. తెలుగు రాష్ట్రాల రాజ్భవన్లలోనూ ఎర్త్ అవర్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఎర్త్ అవర్‌కు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మద్దతు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కార్యాలయాలు, నివాసాల్లో అవసరం లేనిచోట్ల విద్యుత్ లైట్లను ఆర్పివేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు మెరుగైన ప్రపంచాన్ని సృష్టించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. ఎర్త్ అవర్‌లో భాగంగా శనివారం రాత్రి 8.30 నుంచి 9.30 వరకు రాజ్‌భవన్ ఆవరణలో అన్ని అనవసర లైట్లను ఆర్పివేస్తామని గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తెలిపారు.