కేబినెట్‌ పునర్ వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారు!

Compassionate Appointments

AP Cabinet reshuffle : ఏపీ కేబినెట్‌ పునర్ వ్యవస్థీకరణపై ఈ మధ్య డిస్కసన్​ జరుగుతోంది. ఇటీవల వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం భేటీలో కేబినెట్​ పునర్ వ్యవస్థీకరణపై సీఎం వైఎస్‌ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మే నెల నుంచి నెలలో 10 సచివాలయాలను సందర్శించాలని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికలకు సమాయత్తం, పార్టీ సభ్యత్వ నమోదు, బూత్‌ కమిటీల ఏర్పాటుపై ఎమ్మెల్యేలకు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు. జూలై 8న ప్లీనరీ నిర్వహిస్తామన్నారు. మంత్రివర్గాన్ని కూడా పునర్‌ వ్యవస్థీకరిస్తామని వెల్లడించారు. మంత్రి పదవుల నుంచి తొలగించిన వారికి పార్టీలో బాధ్యతలు అప్పగిస్తానని…. జిల్లాలకు ఇంఛార్జులుగా నియమిస్తానని సీఎం జగన్​ చెప్పారు.

AP Cabinet reshuffle : అయితే అప్పటినుంచే మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణపై పార్టీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత… మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన క్రమంలో ఐదేళ్లు పదవులు ఉండవని చెప్పారు. రెండున్నరేళ్ల తర్వాత కొత్త మంత్రులు వస్తారని ప్రకటించారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఇప్పుడు మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై పార్టీ కసరత్తు చేస్తోంది. దీంతో ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. కేబినెట్ నుంచి ఎవరి పదవులు పోతాయే అనే టెన్షన్​ మంత్రుల్లోనూ ఉంది. ఏప్రిల్​లోనే కేబినెట్​ పునర్ వ్యవస్థీకరణ జరిగి కొత్త మంత్రులు వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published.