నటి మీనా ఇంట్లో తీవ్ర విషాదం

నటి మీనా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె భర్త విద్యాసాగర్​ మంగళవారం రాత్రి హఠాన్మరణం చెందారు. ఊపిరితిత్తుల ఇన్​ఫెక్షన్​ కారణంగా చెన్నైలోని ఓ హాస్పిటల్​లో చికిత్స పొందుతూ మృతిచెందారు. అయితే విద్యాసాగర్​ మృతిపట్ల పలు వార్తలు బయటకు వస్తున్నాయి. పావురాల ఇన్​ఫెక్షన్​ కారణంగా మరణించారంటూ వార్తలొస్తున్నాయి. మీనా – విద్యాసాగర్​ నివాసం ఉంటున్న ఇంటికి సమీపంలో పావురాలు ఎక్కువగా ఉంటాయని.. వాటి వ్యర్థాల నుంచి వచ్చిన గాలిని పీల్చడం వల్లే శ్వాసకోస సంబంధిత సమస్యలు వచ్చాయని స్థానిక మీడియా సంస్థలు కథనాలు ప్రచారం చేస్తున్నాయి. అందుకు సంబంధించిన చికిత్స తీసుకుంటున్నారని వార్తలొస్తున్నాయి. అయితే ఈ సంవత్సరం ప్రారంభంలో విద్యాసాగర్​కు కరోనా సోకిందని… దాంతో ఊపిరితిత్తుల సమస్య ఎక్కువైందని.. వాటి మార్పిడి చేయాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. దాతలు దొరక్క విద్యాసాగర్​ మృతిచెందినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published.