ఆర్​ఆర్​ఆర్​ సినిమా టికెట్​ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్​ సిగ్నల్​

RRR Release

RRR Release

RRR Ticket Price: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్​ న్యూస్ చెప్పింది. సినిమా టికెట్ రేట్లు పెంచుకునేలా వెసులుబాటు కల్పించింది. మార్చి 25 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు టికెట్ రేట్లు పెంచుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఇప్పుడున్న ధరలపై సాధారణ ఏసీ, ఏయిర్ కూల్ థియేటర్​లో మొదటి మూడు రోజులు రూ.50, ఆ తర్వాత మూడు రోజులు రూ.30 పెంచుకోవచ్చని పేర్కొంది. 75 ఫీట్ల కంటే ఎక్కువ తెర ఉన్న మల్టీఫ్లెక్స్​లు, ఐమాక్స్ సహా సింగిల్ థియేటర్లలో మొదటి మూడు రోజులు రూ.100, తర్వాత మూడు రోజులు రూ.50 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.

నాన్ ఏసీ థియేటర్లలో టికెట్ ధరల (RRR Ticket Price) యథాతథంగానే ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే ఆర్ఆర్ఆర్ ఐదో షోకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మార్చి 25 నుంచి ఏప్రిల్ 3 వరకు ఉదయం 7 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు సినిమా ప్రదర్శించుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరపై రూ.75 పెంచుకునేందుకు అనుమతి ఇవ్వగా… తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా గ్రీన్​ సిగ్నల్ ఇచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఆర్​ఆర్​ఆర్​ సినిమా టికెట్ ధరలు పెరుగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published.