SIIMA 2021 AWARDS : సైమా 2021 నామినేషన్స్ ప్రక్రియ పూర్తి.. తగ్గేదే లేదంటున్న పుష్ప

siima 2021

imeage from SIIMA Twitter

SIIMA 2021 AWARDS : ఇటీవల కాలంలో చిత్రపరిశ్రమను ఒక ఊపు ఊపిన పుష్ప చిత్రం అవార్డుల పంట పండిస్తోంది. వెండి తెరపై, బుల్లి తెరపై తగ్గేదేలేదంటూ పలు రికార్డులు తిరగరాసిన ఈ చిత్రం తాజాగా సైమా అవార్డుకు నామినేట్ అయింది.

SIIMA 2021 AWARDS : సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) పదో ఎడిషన్​తో ముందుకొచ్చింది. సెప్టెంబరు 10, 11తేదీల్లో బెంగళూరులో ఈ వేడుక జరగనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా అవార్డులకు అత్యధిక నామినేషన్స్ వచ్చిన చిత్రాలను సైమా ఛైర్ పర్సన్ బృందా ప్రసాద్ వెల్లడించారు. 2021లో రిలీజైన నాలుగు భాషలకు చెందిన సినిమాలను ప్రకటించారు. వాటిలో తెలుగు నుంచి పుష్ప, తమిళం నుంచి కరన్, కన్నడ నుంచి రాబర్ట్, మళయాళం నుంచి మిన్నల్ మురళీ చిత్రాలు అత్యధిక నామినేషన్స్ పొందాయని ఆయన తెలిపారు.

అగ్రస్థానంలో పుష్ప



తగ్గేదేలే…
క్రేజీ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా వచ్చిన పుష్ప చిత్రం ఏకంగా 12 నామినేషన్స్ తో అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ 10 నామినేషన్స్ తో రెండో స్థానంలో నిలవలగా.. తర్వాతి స్థానంలో జాతిరత్నాలు, ఉప్పెన చిత్రాలు నిలిచాయి.
మిగతా భాషల విషయానికొస్తే..

తమిళంలో ధనుష్ నటించిన మారి సెల్వరాజ్ కర్ణన్ కు పది నామినేషన్లతో అగ్రస్థానంలో ఉంది. శివకార్తికేయన్ డాక్టర్ 9నామినేషన్లతో తర్వాతి స్థానంలో నిలిచింది. కన్నడలో తరుణ్ సుధీర్ దర్శకత్వం వహించిన రాబక్ట్ చిత్రానికి పది నామినేషన్లు దక్కడంతో మొదటి స్థానంలో నిలిచింది. మళయాళంలో మిన్నల్ మురళీ ప్రథమ స్థానంలో నిలిచింది. అయితే ఈ నామినేషన్ల నుంచి విన్నర్స్ ను ఆన్​లైన్ ఓటింగ్ విధానం ద్వారా ఎంపిక చేసి అవార్డులు అందిస్థామని నిర్వాహకులు తెలిపారు. అందుకోసం అభిమానులు, ప్రేక్షకులు… సైమా వెబ్ సైట్ కి వెళ్లి ఓటు వేయాల్సి ఉంటుందని బృందా ప్రసాద్ సూచించారు.

Read Also: చికెన్ జీఎస్టీ ధమ్ బిర్యానీ ఎలా చేయాలంటే..

Leave a Reply

Your email address will not be published.