రామ్​ చరణ్​కు చిరంజీవి, సమంత స్పెషల్ బర్త్​డే విషెస్​

Samantha

Samantha

పుట్టిన రోజు సందర్భంగా హీరో రామ్​ చరణ్​కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం ఆర్​ఆర్​ఆర్​ మూవీ రిలీజ్​ అవడం… అందులో రామ్​ చరణ్​ యాక్టింగ్​కు ఫిదా అయిన అభిమానులు సోషల్ మీడియాలో ఆయనకు విసెష్​ చెబుతున్నారు. ఆ సినిమాలో రామ్​ చరణ్​ సీన్స్​తో సోషల్‌ మీడియా మొత్తం మార్మోగిపోతోంది. రామ్​ చరణ్​కు స్టార్‌ హీరోయిన్‌ సమంత కూడా బర్త్‌డే విషెస్‌ చెప్పింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామరాజు లుక్‌ను షేర్‌ చేసింది.

‘నా ఫేవరేట్ హీరో రామ్ చరణ్‌కు స్పెషల్ హ్యాపీ బర్త్ డే. ఆర్ఆర్ఆర్ మూవీపై వస్తున్న ప్రశంసలు.. అలాగే నీ అద్భుతమైన మ్యాడ్​ మ్యాడ్​ ఫర్ఫమెన్స్​కు వస్తున్న రెస్పాన్స్‌విన్నప్పుడు చాలా అద్భుతంగా అనిపిస్తోంది. దీంతో సినిమాను చూసేందుకు ఏమాత్రం ఆలస్యం చేయను. ఈ ప్రశంసలన్నింటికి నువ్వు అర్హుడివి. హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్’ అంటూ సామ్​ తన ఇన్​స్టా స్టోరీలో రాసుకొచ్చింది.

మరో వైపు రామ్​ చరణ్​కు తన తండ్రి మెగాస్టార్​ చిరంజీవి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. “రామ్‌చరణ్‌కు సోషల్‌మీడియా ద్వారా బర్త్‌డే విషెస్‌ చెప్పటం నాకు వింతగా అనిపిస్తోంది. అయితే, శుభ సందర్భంలో చరణ్‌కు సంబంధించిన ఫోటో షేర్‌ చేస్తే అభిమానులు ఆనందిస్తారనిపించింది. కొడుకుగా చరణ్‌ నేను గర్వపడేలా చేశాడు. అతడే నా గౌరవం” అని చిరు ట్వీట్‌ చేశారు.


Leave a Reply

Your email address will not be published.