ఆర్టీసీ బస్సులో థియేటర్‌కు RRR టీమ్

RRR Release

RRR Release

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఎస్ఎస్ రాజమౌళితో సహా RRR చిత్ర బృందం హైదరాబాద్​ నగరంలోని థియేటర్ సందర్శన కోసం టీఎస్​ ఆర్టీసీ బస్సులో ప్రయాణించింది. టీమ్ థియేటర్ వద్దకు చేరుకోగానే తమ అభిమాన హీరోలను చూసేందుకు ఎదురుచూస్తున్న అభిమానులు, డప్పుల మోతతో క్రాకర్స్ పేల్చి డ్యాన్స్ చేశారు. ఆర్టీసీ బస్సుకు ప్రాచూర్యం కల్పించడానికి RRR మూవీ టీమ్ కోసం టీఎస్​ ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ బస్సులను ఏర్పాటు చేశారు. RRR టీమ్​ కోసం టీఎస్​ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినందుకు చిత్ర బృందం సజ్జనార్​కు ధన్యవాదాలు తెలిపింది.

రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్​గా దర్శకదీరుడు రాజమౌళి తీశారు. కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజుల జీవితాల ఆధారంగా కల్పిత కథతో సినిమాను రాజమౌళి తీశారు. ఎన్టీఆర్ కొమురం భీమ్​గా, రామ్​చరణ్​ అల్లూరి సీతారామరాజుగా యాక్ట్​ చేశారు. ఈ సినిమాను డీవీవీ ఎంటర్​టైన్​మెంట్స్​ సంస్థ నిర్మిస్తోంది. బాలీవుడ్​ నటి ఆలీయా భట్​, హాలీవుడ్​ బామ ఒలివియా మోరిస్​, బాలీవుడ్​ హీరో అజయ్​ దేవగణ్​, సుముద్రఖని కీలక పాత్రలు పోషించారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైంది.

Leave a Reply

Your email address will not be published.