RRR Movie In Youtube: యూట్యూబ్​లో ఆర్ఆర్ఆర్ సినిమా!

RRR Movie Postpone

RRR Movie Postpone?

RRR Movie In Youtube: రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు పైరసీ దెబ్బ తగులుతోంది. ఏకంగా సినిమా మొత్తాన్ని యూట్యూబ్​లో పెట్టినట్లు వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో రిలీజైన సంగతి తెలిసిందే. అంతటా బ్లాక్ బ్లాస్టర్ టాక్​ను సొంతం చేసుకుని రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే బాహుబలి రికార్డులను చెరిపివేసి సరికొత్త రికార్డును సాధించింది. ఇలా సినిమా కలెక్షన్లతో దూసుకెళుతున్నా… పైరసీని వెంటాడుతోంది. హిందీలో డబ్​ అయిన ఈ సినిమా దుండగులు థియేటర్లో సినిమా మొత్తాన్ని చిత్రీకరించి… దాన్ని యూట్యూబ్​లో అప్​లోడ్ చేశారు.

RRR Movie In Youtube: ఆర్​ఆర్​ఆర్ సినిమా మొత్తం యూట్యూబ్​లో కనిపించడంతో అభిమానులు షాక్ అయ్యారు. వెంటనే సినిమాను యూట్యూబ్​ నుంచి డిలేట్ చేయాలని సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే అభిమానుల అత్యుత్సాహంతో సినిమాకు సంబంధించిన పలు వీడియో క్లిప్పులు బయటకు వచ్చాయి. అలా సినిమాలోని ప్రధాన సీన్లన్నీ ఇంటర్నెట్​లో అందుబాటులోకి వచ్చాయి. చిత్రయూనిట్ దీన్ని గమనించి ప్రత్యేక సాఫ్ట్​వేర్​ ద్వారా తొలగించినా కూడా మళ్లీ మళ్లీ స్వల్ప మార్పులతో వాటిని ఇంటర్నెట్​లో పెట్టేస్తున్నారు.

RRR Cinema Collections: ఇదిలా ఉండగా ఇప్పుడు ఏకంగా సినిమా మొత్తాన్నే పెట్టేయడంతో సినీ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. పైరసీని ప్రోత్సహించడం వల్ల ఆర్ఆర్ఆర్ కలెక్షన్లు మొత్తం తగ్గుతాయని సినీవిశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా 700 కోట్ల క్లబ్​లో చేరిపోయింది. విడుదలైన అతి కొద్ది రోజులకే 700 కోట్ల క్లబ్​లో చేరడంతో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

Leave a Reply

Your email address will not be published.