RRR రికార్డు… మూడురోజుల్లో రూ.500 కోట్లు

rrr poster

RRR 3 Days Collections : దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఇప్పటికే ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఉన్న రికార్డులను తుడిచిపెడుతూ దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమా 500 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరిపోయింది. కేవలం మూడు రోజుల్లోనే (RRR 3 Days Collections) ఈ ఫీట్‌ను సినిమా అందుకుంది. ఇప్పటికే మొదటిరోజు కలెక్షన్లలో రికార్డులను చెరిపేసింది. బాహుబలి పేరిట ఉన్న రికార్డులను ఈ సినిమా బద్దలుకొట్టింది.

మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.223 కోట్లు వసూలు చేసింది. భారతదేశంలో రూ.156 కోట్లు వసూలు చేసింది. యుఎస్, కెనడా నుంచి మరో రూ.42 కోట్లు రాబట్టింది. బాహుబలి 2 మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.217 కోట్లు వసూలు చేసింది. ఆ రికార్డులను ఆర్​ఆర్​ఆర్​ బద్దలు కొట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో రూ.75 కోట్లు, నైజాం ప్రాంతంలో రూ.27.5 కోట్లు, కర్ణాటకలో రూ.14.5 కోట్లు, తమిళనాడులో రూ.10 కోట్లు వసూలు చేసింది. నార్త్ ఇండియాలో రూ.25 కోట్లు రాబట్టింది. ఆల్​ టైమ్​ రికార్డు సృష్టించింది.

రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్​గా దర్శకదీరుడు రాజమౌళి తీశారు. కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజుల జీవితాల ఆధారంగా కల్పిత కథతో సినిమాను రాజమౌళి తీశారు. ఎన్టీఆర్ కొమురం భీమ్​గా, రామ్​చరణ్​ అల్లూరి సీతారామరాజుగా యాక్ట్​ చేశారు. ఈ సినిమాను డీవీవీ ఎంటర్​టైన్​మెంట్స్​ సంస్థ నిర్మిస్తోంది. బాలీవుడ్​ నటి ఆలీయా భట్​, హాలీవుడ్​ బామ ఒలివియా మోరిస్​, బాలీవుడ్​ హీరో అజయ్​ దేవగణ్​, సుముద్రఖని కీలక పాత్రలు పోషించారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైంది.

Leave a Reply

Your email address will not be published.