అంతకంటే ముందే సముద్రఖని ప్రాజెక్టు పూర్తి?

pawan

పవర్​ స్టార్​ పవన్​ కల్యాణ్​ ప్రస్తుతం పుల్​ బిజీగా ఉన్నారు. క్రిష్​ డైరెక్షన్​లో హరిహర వీరమల్లు షూటింగ్​లో బిజీగా బిజీగా గడుపుతున్నారు. అయితే ఈ సినిమాను ఈ వేసవిలో విడుదల చేయాలని ప్లాన్​ చేసినా.. షూటింగ్​ పూర్తవ్వని కారణంగా విడుదల వాయిదా వేస్తున్నారట. దీంతో పాటు హరీష్​ శంకర్​ డైరెక్షన్​లో భవదీయుడు భగత్​ సింగ్​ సినిమా చేస్తున్నారు.. పవర్​ స్టార్​. ఈ సినిమా మంచి మాస్​ మసాలాగా ఉంటుందని టాక్​. ఇవే కాకుండా సురేందర్​రెడ్డి సహా మరో ఇద్దరు డైరెక్టర్లకు పవన్​ కల్యాణ్​ గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చినట్లు తెలుస్తోంది.


వీటితో పాటు సముద్రఖని దర్శకత్వంలో ఓ తమిళ సినిమా రీమేక్​లో నటించేందుకు పవన్​ స్టార్​ సిద్ధం అవుతున్నారని టాక్​ వినిపిస్తోంది. అయితే హరీశ్​ శంకర్​ సినిమా కంటే.. సముద్రఖని ప్రాజెక్టు పూర్తిచేసే ఆలోచనలో పవన్​ కల్యాణ్​ ఉన్నట్లు సమాచారం. ఈ దిశగానే సన్నాహాలు చేస్తున్నారని టాక్​.

Leave a Reply

Your email address will not be published.