RRR Review: RRR తీసినందుకు రాజమౌళిని ఆర్నెళ్లు జైల్లో పెట్టాలి: కేఆర్కే

rrr
RRR Review: ఆర్ఆర్ఆర్ తలా తోకా లేని సినిమా అని బాలీవుడ్ క్రిటిక్, యాక్టర్ కమల్ ఆర్.ఖాన్ (కేఆర్కే) విమర్శించారు. దర్శకధీరుడు రాజమౌళి, ఆర్ఆర్ఆర్ సినిమాపై వరుసగా ట్వీట్లు చేశారు. ఆర్ఆర్ఆర్ అట్టర్ ప్లాప్ అని ఆమిర్ ఖాన్ ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’తో కంపేర్ చేశాడు. రాజమౌళి సాబ్ తమాషా కొంచెం ఎక్కువ కాలేదా? కొంత అయినా లిమిట్ ఉండాలి అంటటూ విమర్శలు మొదలు పెట్టారు. మీరు అన్ లిమిటెడ్ నుంచి ఊడిపడ్డారని అన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా చూస్తే తన నా నాలెడ్జ్ అంతా జీరో అయిందని చెప్పారు.
భారతీయ సినిమా చరిత్రలో ఇంతకు ముందెన్నడూ చేయని సినిమా ఆర్ఆర్ఆర్ అని కేఆర్కే (RRR Review) విమర్శించారు. ఈ సినిమా మనిషి మెదడు కణాలను నాశనం చేస్తుందని అన్నారు. భారతదేశంలో ఇప్పటివరకు తీసిన అత్యంత చెత్త సినిమా ఇదని పేర్కొన్నారు. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్తో పోల్చారు. ఇది పొరపాటు కాదని… ఇదొక పెద్ద నేరం అని చెప్పుకొచ్చారు. రూ.600 కోట్లతో ఇటువంటి చెత్త సినిమా తీసినందుకు రాజమౌళిని ఆర్నెల్లు జైల్లో పెట్టాలని ట్వీట్ చేశారు.