ఆతృతగా ఎదురు చూస్తున్న సమయం వచ్చింది… మరి కొన్ని గంటల్లో ఆర్ఆర్ఆర్

RRR Release : సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. మరికొద్ది గంటల్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదల సందర్భంగా ఫ్యాన్స్ థియేటర్ల వద్ద ఎన్టీఆర్, రామ్‌చరణ్‌తో పాటు డైరెక్టర్ రాజమౌళి కటౌట్లు, ఫ్లెక్సీలు కడుతున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్‌గా సుమారు రూ.500 కోట్ల బడ్జెట్‌తో దర్శకదీరుడు రాజమౌళి తీశారు. ఇద్దరు స్వతంత్ర సమరయోధుల మధ్య స్నేహం ప్రధానంగా సాగే కథాంశంతో ఈ మూవీ తీశారు. కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజుల జీవితాల ఆధారంగా కల్పిత కథతో సినిమాను రాజమౌళి తీశారు. ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా, రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా యాక్ట్ చేశారు.

ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు అన్ని కూడా హిట్ అయ్యాయి. దోస్తి, నాటు నాటు సాంగ్, జనని పాటు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఆర్ఆర్ఆర్ సినిమాలోని పాత్రలు, సంఘటనలకు ఆత్మగా భావించే జనని గీతానికి మంచ్రి క్రేజువచ్చింది. మూవీ నుంచి ఇప్పటివరకు వచ్చిన ఫస్ట్ లుక్స్, గ్లింప్స్, పాటలకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. సినిమా టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేచాయి. ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ (RRR Trailer) సన్నివేశాలు, డైలాగ్‌లు ఆద్యంతం ఆదరహో అనేలా ఉన్నాయి. ‘తొంగి తొంగి నక్కి నక్కి కాదే.. తొక్కుకుంటా పోవాలి…’, ‘యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయి…’, ‘భీం…. ఈ నక్కల వేట ఎంతసేపు… కుంభస్తలాన్ని బద్ధల కొడదాం పదా…’ అంటూ సాగే డైలాగులు ప్రేక్షకుడిని మునివేళ్లపై నిలబెడుతున్నాయి.

ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. బాలీవుడ్ నటి ఆలీయా భట్, హాలీవుడ్ బామ ఒలివియా మోరిస్, బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్, సుముద్రఖని కీలక పాత్రలు చేస్తున్నారు. మరి కొన్ని గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల (RRR Release ) కానుంది.
‘ఆర్ఆర్ఆర్’ సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు తెలుగు ప్రభుత్వాలు ఓకే చెప్పాయి. సినిమా టికెట్ రేట్లు పెంచుకునేలా వెసులుబాటు కల్పించింది. మార్చి 25 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు టికెట్ రేట్లు పెంచుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఇప్పుడున్న ధరలపై సాధారణ ఏసీ, ఏయిర్ కూల్ థియేటర్లో మొదటి మూడు రోజులు రూ.50, ఆ తర్వాత మూడు రోజులు రూ.30 పెంచుకోవచ్చని పేర్కొంది. 75 ఫీట్ల కంటే ఎక్కువ తెర ఉన్న మల్టీఫ్లెక్స్‌లు, ఐమాక్స్ సహా సింగిల్ థియేటర్లలో మొదటి మూడు రోజులు రూ.100, తర్వాత మూడు రోజులు రూ.50 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే ఐదో షోకు ఓకే చెప్పింది.

సినిమా టికెట్‌పై రూ.75 పెంచుకునేందుకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా రిలీజ్ తేదీ నుంచి మొదటి 10 రోజులు పెంపునకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, పొలీస్ కమిషనర్లు, జేసీలకు ఆదేశాలు జారీ చేసింది.