గల్లీ బాయ్ ర్యాపర్ మృతి… రణ్వీర్ సంతాపం

గల్లీ బాయ్ ర్యాపర్ ధర్మేష్ పర్మార్ అలియాస్ ఎంసీ టాడ్ ఫాడ్ ( 24) మరణించాడు. రణ్వీర్ సింగ్ -సిద్ధాంత్ చతుర్వేది నటించిన గల్లీ బాయ్లోని ఇండియా 91 పాటకు తన గాత్రాన్ని అందించాడు. గుండె జబ్బు వల్ల మరణించినట్లు తెలుస్తోంది. ఆయన నాసిక్ సమీపంలోని ఒక ప్రదేశంలో ఫుట్‌బాల్ ఆడుతుండగా కుప్పకూలిపోయాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు షాక్‌కు గురయ్యారు. గల్లీబాయ్ సినిమాలోని ‘ఇండియా 91’ పాటను టాడ్ ఫాడ్ పాడాడు. దానికి ర్యాప్ వెర్షన్ చాలా ఫేమస్ అయింది.
ర్యాపర్ టాడ్ ఫాడ్ ఆకస్మిక మరణంతో బాలీవుడ్ శోఖ సంద్రంలో మునిగింది. రణ్వీర్ సింగ్ బ్రోకెన్ హార్ట్ ఎమోజీతో కూడిన రాపర్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. రాపర్‌తో తను చివరి సారిగా చేసిన చాట్ స్క్రీన్‌షాట్‌ను సిద్ధాంత్ పంచుకున్నారు. కెరీర్లో ముందడుగు వేస్తున్న సమయంలోనే టాడ్ ఫాడ్ మరణించడంతో బాలీవుడ్ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.