Bimbisara : బాలీవుడ్​లో సత్తాచాటేందుకు రెఢీ అవుతున్న ‘బింబిసార’

bimbisara

bimbisara

Bimbisara : టాలీవుడ్​లో హిట్ అయిన సినిమాలు బాలీవుడ్​లోను రిలీజ్ అవడం ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి. తాజాగా ఆ జాబితాలో బింబిసార చేరనున్నట్లు సమాచారం. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, కేథరిన్, సంయుక్త మీనన్ జంటగా ఆయన సొంత బ్యానర్​లో తెరకెక్కిన చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ విజయం అందుకుంది. వశిష్ఠ దర్శకత్వంతో వచ్చిన ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ డిఫరెంట్ పాత్రల్లో ఒదిగిపోయారు. ప్రేక్షకుల మన్ననలు పొందిన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబడుతూ విజయపరంపరలో దూసుకుపోతోంది. పీరియాడిక్, సైన్స్ ఫిక్షన్ కోణంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుడి నాడిని పట్టింది. కీరవాణితో పాటు చిరంతన్ భట్ అందించిన సంగీతం ప్రేక్షకుడిని సినిమాలో లీనం చేసింది. బార్భేరియన్ కింగ్.. బింబిసారగా కళ్యాణ్ రామ్ నటన కట్టిపడేసింది.

Bimbisara : అయితే ఈ చిత్రాన్ని తెలుగులో మాత్రమే రిలీజ్ చేశారు. ఇక్కడ సక్సెస్ అయితే మిగతా భాషల్లోను విడుదల చేస్తామని గతంలో కళ్యాణ్ రామ్ ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగులో భారీ విజయం అందుకున్న ఈ చిత్రాన్ని ఇప్పుడు హిందీలోను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే హిందీలో రిలీజైన కార్తికేయ 2 భారీ వసూళ్లు రాబడుతోంది. ఈ నేపథ్యంలో హిందీలో బింబిసార ను రిలీజ్ చేసేందుకు కసరత్తులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తెలుగు తెరపై కలెక్షన్లు కురిపించిన బింబిసార హిందీలోను విజయం సాధిస్తోందని నందమూరి అభిమానులు ఆశిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.