ప్రముఖ నటుడు అభిషేక్ ఛటర్జీ మృతి

Actor Abhishek Chatterjee

Actor Abhishek Chatterjee Passes Away: బెంగాలీ నటుడు అభిషేక్ ఛటర్జీ మృతి చెందారు. అభిషేక్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తెల్లవారుజామున తన నివాసంలో మరణించారు. తరుణ్ మజుందార్ దర్శకత్వం వహించిన బెంగాలీ చిత్రం పాఠ్భోలా (1986)తో అభిషేక్ ఛటర్జీ సినిమాల్లోకి అరంగేట్రం చేశారు. సంధ్యా రాయ్, ప్రోసెన్‌జిత్ ఛటర్జీ, తపస్ పాల్, ఉత్పల్ దత్ వంటి సీనియర్ నటులతో కలిసి సినిమాలు చేశారు. బారనగోర్ రామకృష్ణ మిషన్ ఆశ్రమ హైస్కూల్​లో చదివి… కలకత్తా విశ్వవిద్యాలయంలోని సేథ్ ఆనంద్రామ్ జైపురియా కళాశాల నుంచి పట్టభద్రుడయ్యాడు.

ఒరా చార్జోన్, తుమీ కోటో సుందర్, సురేర్ ఆకాషే, తూఫాన్, మర్యాద, అమర్ ప్రేమ్, పాపి, హరనేర్ నాట్ జమై, జీవన్ ప్రదీప్, పురోషోత్తమ్ అబిర్వాబ్, మేయర్ అంచల్, అర్జున్ అమర్ నామ్, సాబుజ్ సాథీ వంటి చిత్రాల్లో నటించారు. అభిషేక్ మృతి పట్ల పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంతాపం తెలిపారు. “మా యువ నటుడు అభిషేక్ ఛటర్జీ అకాల మరణం బాధాకరం. అభిషేక్ ప్రతిభావంతుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి. మేము అతన్ని కోల్పోయాము. ఇది టీవీ సీరియల్స్, మా చిత్ర పరిశ్రమకు తీరని లోటు. అని ట్వీట్​ చేశారు. ఆయన మృతి (Actor Abhishek Chatterjee Passes Away) పట్ల శ్రద్ధాంజలని ఘటించారు. కుటుంబం, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.