యూఏఈ బిజినెస్​మ్యాన్​తో నటి పూర్ణ పెళ్లి

మల్లు బ్యూటీ పూర్ణ తన ఫ్యాన్స్​కు శుభవార్త చెప్పారు. త్వరలో తాను పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు ఇన్​స్టా వేదికగా వెల్లడించారు. యూఏఈకి చెందిన బిజినెస్​మ్యాన్, జేబీఎస్​ గ్రూప్​ ఆఫ్​ కంపెనీస్​ సీఈవో, ఫౌండర్​ షానీద్ అసిఫ్​ అలీని పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు. ‘కుటుంబ సభ్యుల ఆశీస్సులతో జీవితంలో కొత్త జీవితం ప్రారంభిస్తున్నాం. ఇట్​ అపిషియల్​’ అంటూ తనకు కాబోయే భర్త ఫోటోను ఇన్​స్టాలో ఫోస్టు పెట్టారు. శ్రీ మహాలక్ష్మి, అవును, సీమ టపాకాయ్​, అఖండ వంటి సినిమాలతో పూర్ణ మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఢీ లో జడ్జిగా చేస్తున్నారు. పెళ్లి తర్వాత మల్లు బ్యూటీ సినిమాలకు గుడ్​ బై చెబుతుందా లేదో చూడాలి.

Leave a Reply

Your email address will not be published.