Volunteer Rape On Minor Girl : బాలికపై అత్యాచారానికి పాల్పడిన గ్రామ వాలంటీర్

Volunteer Rape On Minor Girl : తూర్పుగోదావరిజిల్లా సీతానగరం మండలం బొబ్బిలంకలో దారుణం జరిగింది. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేస్తామంటూ ముందుకొచ్చిన వాలంటీర్ ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతే కాకుండా ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు.
Volunteer Rape On Minor Girl : పోలీసుల వివరాల ప్రకారం బొబ్బిలంక గ్రామంలో వాలంటీర్ గా పనిచేస్తున్న బూసి సతీశ్ (23) గ్రామంలోని ఓ బాలికపై కన్నేశాడు. ప్రభుత్వ పథకాల పేరుతో ఆ ఇంటికి తరచూ వెళ్తూ.. వారితో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఇంటికి వెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించడంతో ఆమె మిన్నుకుండిపోయింది.
అయితే కొన్ని రోజులుగా బాలిక ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లిదండ్రులు ఆమెను నిలదీయడంతో అసలు విషయం చెప్పింది. ఈ విషయమై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గ్రామవాలంటీర్ ను అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేసే వారథులుగా బాధ్యతలు చేపట్టిన వాలంటీర్లలో పలువురు ఇలాంటి పెడతోవ పట్టడం ఆందోళన కలిగిస్తుంది. కొందరు చేస్తున్న పనుల వల్ల వ్యవస్థపై ప్రభావం చూపే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.