ఆడపిల్ల పుట్టిందని ఒవెన్లో పెట్టి చంపింది!

ఢిల్లీలోని మాలవీయనగర్లో అమానవీయ ఘటన జరిగింది. రెండు నెలల వయసున్న కూతుర్ని ఓ కసాయి తల్లి దారుణంగా హత్య చేసింది. ఎవరికీ అనుమానం రాకుండా చిన్నారి మృతదేహాన్ని ఒవెన్లో పెట్టింది. పొరుగింటి అబ్బాయి నిందితురాలి ఇంటికి వెళ్లి… ఎంత సేపు తలుపు కొట్టినా తీయలేదు. చిన్నారి కూడా కనిపించకపోవడంతో అనుమానంతో స్థానికులు చుట్టుపక్కల వెతికారు. చివరకు ఇంట్లోని ఒవెన్లో రెండెళ్ల చిన్నారి విగత జీవిగా కనిపించిందని స్థానికులు తెలిపారు. ఆడపిల్ల పుట్టిందనే అక్కసుతో ఆమె ఈ పని చేసిందని వెల్లడించారు. హత్యలో వేరెవరైనా నిందితులు ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.