తిరుమల ఘాట్‌ రోడ్డులో బస్సులో అగ్ని ప్రమాదం

Bus fire at Tirumala : తిరుమల ఎగువ ఘాట్ రోడ్డులో బస్సులో మంటలు చెలరేగాయి. తిరుపతి నుంచి తిరుమలకు వస్తున్న టీటీడీ ఫ్రీ బస్సులో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన డ్రైవర్​ బస్సును పక్కకు ఆపాడు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజిన్​తో బస్సులో చెలరేగిన (Bus fire at Tirumala ) మంటలను ఆర్పివేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంజింన్ నుంచి మంటలు వచ్చినట్లు భావిస్తున్నారు. బస్సులో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదము జరగలేదు.

ఈ నెల 19న తిరుమల కనుమదారిలో కారు దగ్ధమైంది. కొండపైకి కారు వెళ్తున్న క్రమంలో వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన భక్తులు కారును పక్కకు ఆపి దిగిపోయారు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చూస్తుండగానే కారు మొత్తం కాలి బూడిద అయింది. సమాచారం అందుకున్న ఫైర్ ఇంజిన్​ సిబ్బంది మంటలను అదుపు చేశారు. రహదాపై కారు తగలబడుతుండడంతో కొంత సమయం వాహనాలను నిలిపివేశారు.

Leave a Reply

Your email address will not be published.