దివ్యాంగ బాలుడిపై లైంగిక దాడి… హత్య చేసి గోనే సంచిలో పెట్టి…

మహారాష్ట్ర పూణేలో దారుణం జరిగింది. ఓ 13 ఏళ్ల దివ్యాంగ బాలుడిపై లైంగిక దాడి చేసి… అనంతరం హత్య చేశారు. ఆ బాలుడి మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి చెత్తకుండిలో పడేశారు. మహబూబ్​నగర్​ గండేడ్‌ మండలానికి చెందిన దంపతులు 15 ఏళ్లుగా పూణెలో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీళ్లకు ముగ్గురు పిల్లలు. ఇందులో రెండో కుమారుడు మూగవాడు. దీంతో అతన్ని పాఠశాలకు పంపలేదు. తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్తే ఈ బాలుడు ఇంటి వద్దే ఉండేవాడు. రోజూలాగే గురువారం కూడా తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లడంతో బాలుడు ఇంటివద్దే ఉన్నాడు.

అయితే ఇంటి వద్ద ఉన్న ఈ బాలుడిపై ఇంటి పక్కనే ఉంటున్న యూపీకి చెందిన ఇద్దరు వ్యక్తుల కన్ను పడింది. సాయంత్రం ఈ బాలుడిని బైక్‌పై ఓ ప్రాంతానికి తీసుకెళ్లి మరో ఇద్దరితో కలిసి లైంగిక దాడికి పాల్పడ్డారు. తమ లైంగిక వాంఛ తీర్చుకున్నాక ఆ బాలుడిని చంపారు. అనంతరం బాలుడి మృతదేహాన్ని గోనె సంచిలో తీసుకొచ్చి చెత్తకుండిలో వేస్తుండగా సెక్యూరిటీ గార్డు చూసి పోలీసులకు సమాచారం అందించాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తల్లిదండ్రులు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. పూణె నుంచి శనివారం ఉదయం స్వగ్రామానికి బాలుడి మృతదేహాన్ని తల్లిదండ్రులు తీసుకొచ్చారు. తమ పొలంలో అంత్యక్రియలు నిర్వహించారు. బాధిత కుటుంబాన్ని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబానికి డబుల్‌ బెడ్‌రూం ఇల్లుతో పాటు అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published.