సెల్ ఫోన్ కొనివ్వలేదని తల్లినే చంపాడు

murder

జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం షేర్ పల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. సెల్ ఫోన్ కొనివ్వలేదని తల్లినే చంపాడు ఓ కసాయి కొడుకు. షేర్ పల్లి గ్రామానికి చెందిన లక్ష్మి, వెంకటేశ్వర్లు దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు మహేష్​ ఇంటర్‌ పూర్తి చేసి కూలీ పనులు చేసుకుంటు జీవిస్తున్నాడు. ఇటీవల మహేష్ స్మార్ట్​ ఫోన్ కొనివ్వాలని తల్లితో గొడవ పడుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం తల్లితో మరోసారి గొడవపడ్డాడు. మహేష్​ క్షణికావేశంలో రోకలిబండతో తల్లి తలపై కొట్టాడు. దీంతో ఆమె తీవ్ర గాయాలపాలయింది. 108 సిబ్బంది వచ్చి పరీక్షించి… ఆమె మరణించినట్లు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.