స్కూల్​కు వెళ్లి వస్తున్న బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం

rape

మేడ్చల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 31న బాలిక తన ఫ్రెండ్స్​తో కలిసి స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆ బాలికకు పరిచయమున్న 50 ఏళ్ల ఆటో డ్రైవర్ ఆమెను మాత్రమే ఆటోలో ఎక్కించుకొని వెళ్లిపోయాడు. ఈ విషయం మిగాతా విద్యార్థులు స్కూల్ టీచర్​కు చెప్పారు. దీంతో ఆ బాలికను పిలిచిన టీచర్​… ఏం జరిగిందని ఆరా తీసింది. ఆటో డ్రైవర్ వెంకటయ్య తనపై అత్యాచారం చేసినట్లుగా బాలిక చెప్పింది. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు టీచర్​ ఫోన్​ చేసి చెప్పింది. ఆటో డ్రైవర్​పై పోలీస్ కంప్లైంట్​ ఇవ్వాలని అంది.

పోలీసులకు కంప్లైంట్​ చేశారా అని బాలికను టీచర్​ సోమవారం అడిగింది. పోలీసులకు కంప్లైంట్​ చేయలేదని ఆ బాలిక చెప్పడంతో ఆమె తల్లిదండ్రులను టీచర్​ స్కూల్​కు పిలిపించింది. ఇలాంటి వాళ్లపై పోలీసు కంప్లైంట్​ చేయకుంటే… వాళ్లు ఇంకా ఇలాంటి పనులే చేస్తారని హెచ్చరించి… పోలీసులకు కంప్లైంట్​ ఇవ్వాలని చెప్పింది. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద నిందితుడు ఆటో డ్రైవర్ వెంకటయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published.