మాజీ ప్రియుడిని హతమార్చబోయిన యువతి

murder

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ప్రేమ వ్యవహారం హత్యాయత్నానికి దారితీసింది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఔట్​ సోర్సింగ్​లో విధులు నిర్వహిస్తున్న నజీర్, ఆసిఫాలు గత కొద్ది నెలలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ విషయం ఆసిఫా తల్లిదండ్రులు తెలిసింది. కానీ వారి ప్రేమను ఒప్పుకోలేదు. ఆసిఫాకు మరో వ్యక్తితో పెళ్లి సెట్​ చేశారు. అతనికి తన ప్రేమ గురించి ఆసిఫా చెప్పింది. తనకు పెళ్లి సెట్​ కావడంతో తమ వద్ద ఉన్న కాల్ రికార్డు, ఫోటోలు డిలీట్ చేద్దామని నజీర్​ను ఆసిఫా పిలిపించింది. ఇద్దరు తమ ఫోన్లల్లో ఉన్న ఫోటోలు డిలీట్ చేశారు. అనంతరం నజీర్​ అక్కడి నుంచి స్కూటీపై వెళ్తుండగా కారుతో ఢీకొంచారు. దీంతో నజీర్​కు తీవ్ర గాయాలయాలు అయ్యాయి. అతన్ని ఆసుపత్రికి తరలించారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published.