ఫుట్​బాల్​ మ్యాచ్​లో గ్యాలరీ కూలి 200 మందికి గాయాలు

Kerala Football Accident: కేరళలో శనివారం రాత్రి జరిగిన ఒక ఫుట్‌బాల్ మ్యాచ్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. మలప్పురం జిల్లాలోని కలికావులోని పూన్‌గోడె ఫుట్‌బాల్‌ మైదానంలో మ్యాచ్ జరుగుతుండగా ప్రేక్షకులు కూర్చున్న ఒక గ్యాలరీ అకస్మాత్తుగా కూలింది. కిక్కిరిసిన గ్యాలరీ ఒక్కసారిగా కూలగా కూర్చున్నవారంతా ఒకరిపై ఒకరు పడిపోయారు. ఈ సమయంలో అక్కడే ఫ్లడ్‌లైట్ల కోసం వేసిన టవర్‌ కూడా కూలిపోయి కింద ఉన్న ప్రేక్షకులపై పడింది.

Kerala Football Accident: అక్కడే ఉన్న పోలీసులు, మ్యాచ్ నిర్వాహకులు, స్థానికులు సహాయ చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో 200 మందికిపైగా గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రులకు తరలించారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రెండు రోజులుగా వర్షాలు కురవడం, వెదురుతో నిర్మించిన గ్యాలరీ జనంతో కిక్కిరిసిపోవడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు.

Leave a Reply

Your email address will not be published.