బాలికపై అత్యాచారం… హత్య

Sexual assault

Sexual assault

వికారాబాద్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బాలికను గుర్తుతెలియని వ్యక్తులు చంపేశారు. తెల్లవారుజామున 5 గంటలకు బహిర్భూమికి వెళ్లిన బాలిక ఇంటికి తిరిగిరాకపోవడంతో వెళ్లి చూసిన తల్లికి విగతజీవిగా కనిపించింది. బాలిక బట్టలు లేకుండా కనిపించింది. వెంటనే పోలీసులకు సమచారం అందించారు. బాలికపై అత్యాచారం చేసి హత్యకు పాల్పడిఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా పోలీసుల వద్ద పలువురిపై అనుమానం వ్యక్తం చేశారు. బాలిక తలకు స్వల్ప గాయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.