‘టాటూల్లా ఉండిపోతాయనే బాలిక మెడపై కొరికాం’

Sexual assault
హైదరాబాద్ జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనలో రోజుకు విషయం వెలుగులోకి వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలం రేపిన మైనర్‌పై గ్యాంగ్ రేప్ ఘటనలో పోలీసులు విచారణలో మరో కీచక పర్వం బయటకువచ్చింది. జువైనల్ హోంలో ఉన్న ఉన్న ఐదుగురు మైనర్లు సహా ప్రధాన నిందితుడు సాదుద్దీన్ శనివారం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌లో వారికి లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించారు. అనంతరం శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారించారు. శుక్రవారం విచారణ సందర్భంగా అసలు నోరు మెదపని నిందితులు.. శనివారం కీలక విషయాలు వెల్లడించారు.
జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మగుడి సమీపంలో నిర్మానుష్య ప్రదేశానికి కారు తీసుకెళ్లి.. బాలికపై ఒకరితర్వాత అత్యాచారం చేసినట్లు నిందితులు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. బాలిక శరీరంపై గాయాలపై ప్రశ్నించగా.. బాలిక మెడపై టాటూల్లా ఉంటాయనే పళ్లతో కొరికినట్లు నిందితులు అంగీకరించినట్లు తెలిపారు. బాలిక ప్రతిఘటించడం వల్లే ఆమెకు గాయాలు అయినట్లు నిందితులు చెప్పారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ రెచ్చగొట్టడంతోనే బాలికను రేప్ చేసినట్లు విచారణలో చెప్పినట్లు సమాచారం.. అయితే ఎమ్మెల్యే కుమారుడే తొలుత బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు సాదుద్దీన్ చెప్పినట్లు తెలుస్తోంది. సుమారు గంటపాటు విచారించిన పోలీసులు.. నిందితులను జువైనల్‌హోంకు తరలించారు.