30 ఏళ్లలో 60 మందిపై లైంగిక వేధింపులు.. కీచక టీచర్ అరెస్ట్

Sexual Harassment on women
అతనో ఉపాధ్యాయుడు. ఈ మధ్యనే ఉద్యోగం నుంచి రిటైరయ్యాడు. అయితే ఉపాధ్యాయుడిగా పనిచేసిన సమయంలో పాల్పడిన అనేక దారుణ ఘటనలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. 30 ఏళ్ల కాలంలో సుమారు 60 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించినట్లు పలువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేరళలోని మలప్పురం మున్సిపాలిటిలో కౌన్సిలర్ కేవీ శశికుమార్… సేంట్ గెమాస్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్లో టీచర్‌గా పనిచేసేవాడు. 2022 మార్చిలో రిటైర్ అయ్యాడు. టీచర్‌గా పనిచేసిన సమయంలో అనేక మంది విద్యార్థినులను లైంగికంగా వేధించినట్లు పోలీస్ కేసునమోదైంది. అయితే తనకున్న రాజకీయ పలుకుబడితో కేసు ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నాడు. అయితే మార్చిలో రిటైర్డ్ అయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితులు తన ఆవేదనను వెళ్లగక్కింది.
దీంతో పరారీలోకి వెళ్లిపోయాడు. వారం రోజులపాటు తీవ్రంగా గాలించిన కీచక టీచర్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేరళ విద్యాశాఖ మంత్రి విచారణకు ఆదేశించారు. స్కూల్ మేనేజ్మెంట్ లోపాలపైనా దర్యాప్తే చేయాలని స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో శివకుమార్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు సీపీఎం వెల్లడించింది.