కట్నం కోసం భార్యపై గ్యాంగ్​రేప్​ చేయించిన భర్త

rape

Gang rape on wife: దేశంలో వరకట్న వేధింపులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. కట్నం డబ్బుల కోసం కట్టుకున్న భార్యలతో కొందరు భర్తలు అత్యంత నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఇటువంటి ఘటనే రాజస్థాన్​లో వెలుగులోకి వచ్చింది. పెళ్లి సమయంలో తనకు రావాల్సిన కట్నం పూర్తిగా ఇవ్వలేదనే కోపంతో ఇద్దరు బంధువులతో భార్యను రేప్​ చేయించాడో భర్త. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Gang rape on wife: రాజస్థాన్​ భరత్​పూర్​కు చెందిన ఓ వ్యక్తి.. అదే రాష్ట్రానికి చెందిన యువతితో 2019లో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి ముందు అత్తింతివారు కొంత కట్నం ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే కొన్ని కారణాలతో సుమారు లక్ష యాబై వేల రూపాయలు ఇవ్వలేకపోయారు. దీంతో ఆగ్రహించిన సదరు వ్యక్తి అప్పటి నుంచి భార్యను వేధించేవాడు. మరింత నీచానికి ఒడిగట్టి.. తన ఇద్దరు బందువులతో భార్యను రేప్​ చేయించాడు. దాన్ని ఫోన్​లో వీడియో తీసి యూట్యూబ్​లో అప్​లోడ్​ చేసి డబ్బు సంపాదించుకుంటానంటూ భార్యను బెదిరించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తనపై భార్త తరఫు బంధువులు రేప్​ చేసినట్లు ఫిర్యాదుచేసింది.

Read Also: Lovers Romance on Bike Riding: బైక్‌పై రొమాన్స్.. అర్జున్ రెడ్డి సీన్ రిపీట్!

Leave a Reply

Your email address will not be published.