Gang Rape On Minor Girl : కదులుతున్న బస్సులో బాలికపై గ్యాంగ్ రేప్…

Gang Rape On Minor Girl : అవనిపై రోజురోజుకు అతివకు రక్షణ లేకుండా పోతుంది. ఇంటా బయట మానవ తోలు కప్పుకున్న మృగాల వేటలో పసికందు నుంచి పండు ముసలి వరకు బలైపోతున్నారు. తాజాగా బిహార్ లో నిర్భయ లాంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కదులుతున్న బస్సులో ఓ మైనర్ బాలికపై కొందరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఈస్ట్ చంపారన్ జిల్లాలో మంగళవారం నాడు జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దుశ్చర్యకు సంబంధించి పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.
Gang Rape On Minor Girl : ఈస్ట్ చంపారన్ జిల్లా మోతిహరి బస్టాండ్ వద్ద ఓ బాలిక వెస్ట్ చంపారన్ లోని ఓ ప్రాంతానికి వెళ్లేందుకు బస్ కోసం వెయిట్ చేస్తూ ఇంది. ఇంతలో ఓ బస్సు డ్రైవర్… బస్సు అటే వెళ్తుందని చెప్పడంతో అతడి మాయ మాటలు నమ్మి బస్సు ఎక్కింది. అప్పటికే బస్సులో ఉన్న మృగాళ్లు ఆమెకు కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చారు. ఆమెకు స్పృహ తప్పగా.. నలుగురు ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు.
బాలికకు మెలకువ వచ్చే సరికి బస్సు తలుపులు వేసి ఉన్నట్లు తెలిపింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనకు సంబంధించి ఆధారాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు.
Read ALSO : భర్తతో చనువుగా ఉంటోందని యువతిపై లైంగిక దాడి చేయించిన భార్య