భర్తతో చనువుగా ఉంటోందని యువతిపై లైంగిక దాడి చేయించిన భార్య

rape

హైదరాబాద్​లో రోజురోజుకు నేరాలు అధికమవుతున్నాయి. పరువు హత్యలు, అత్యాచారాలు, మహిళలపై లైంగిక దాడులకు భాగ్యనగరంలో వేదిక కావడం ఆందోళన కలిగిస్తోంది. తన భర్తకు సన్నిహితంగా ఉంటోందన్న కారణంగా యువతిపై ఓ వివాహిత లైంగిక దాడి చేయించింది. ఈ ఘటన కొండాపూర్​లో చోటుచేసుకుంది. కొండాపుర్​లో శ్రీకాంత్​ తన కుటుంబంలో సహా నివాసం ఉంటున్నాడు. యూపీఎస్సీకి ప్రిపేర్​ అవుతున్నాడు. అదే కాలనీలో నివాసం ఉండే యువతి సైతం యూపీఎస్సీకి ప్రిపేర్​ కావడంతో వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని తప్పుగా అర్థం చేసుకున్న శ్రీకాంత్​ భార్య.. యువతిపై కోపం పెంచుకుంది. పోలీసులను సైతం ఆశ్రయించింది. అయినా యువతిని ఏదో చెయ్యాలని పథకం వేసింది.


కేసు వెనక్కి తీసుకుంటానంటూ ఇంటికి పిలిచింది. పథకం ప్రకారం ఓ గదిలోకి తీసుకెళ్లి నలుగురు యువకులతో ఆమెపై లైంగిక దాడి చేయించింది. యువతి నోట్లో గుడ్డలు కుక్కి తీవ్రంగా హించించారు సదరు యువకులు. అంతటితో ఆగక ఈ వ్యవహారాన్ని ఫోన్లో వీడియో తీశారు. ఈ లైంగిక దాడి విషయం ఎవరికి చెప్పినా వీడియోలు ఇంటర్నెట్​లో పెడతామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన బాధితులని కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు హాస్పిటల్​కు తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సదరు మహిళ సహా నలుగురు యువకులను అరెస్ట్​ చేశారు.

Leave a Reply

Your email address will not be published.