Bomb Blast In A Mosque : బాంబు పేలుడుతో దద్ధరిల్లిన కాబూల్

Bomb Blast In A Mosque : బాంబు పేలుడుతో ఆప్గనిస్తాన్​లోని కాబూల్ నగరం ఉలిక్కి పడింది. ఓ మసీదులో బాంబు పేలుడు దాటికి దద్దరిల్లింది. ఘటనలో 20 మంది మృతి చెందగా.. 40 మంది వరకు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఖైర్ ఖానాలోని సిద్ధిఖియా మసీదులో సాయంత్రం వేళ ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది.

Bomb Blast In A Mosque : బుధవారం సాయంత్రం జరిగిన ఈ పేలుడు ఘటనతో స్థానికంగా ఒక్కసారిగా భయానక వాతావరణ నెలకొంది. పేలుడు ప్రభావం సుమారు కిలోమీటరు ఉందని స్థానికులు చెబుతున్నారు. భారీ పేలుడు దాటికి సమీపంలోని భవనాలు కొన్ని సెకన్ల పాటు కంపించాయని, కిటికీల అద్దాలు పగిలిపోయాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనను తాలిబన్ ఇంటలిజెన్స్ నిర్ధారించింది. అయితే ఈ ఘటనకు సంబంధించి బాధ్యులమని ఏ సంస్థ ప్రకటించలేదు. బాంబు దాడిలో మసీదు ఇమామ్ ముల్లా అమీర్ మహ్మద్ కాబూలీ మృతి చెందినట్లు సమాచారం.

మరోవైపు ఆప్గాన్​లో తాలిబన్లు అధికారం లోకి వచ్చినప్పటి నుంచి పలు ఘటనలు సంభవిస్తూనే ఉన్నాయి. దేశంలో శాంతి భద్రతలు సమర్థవంతంగా అమలుచేస్తున్నామని చెబుతున్న తాలిబన్లను ఈ ఘటన ఉలిక్కిపాటుకు గురిచేసింది.

Leave a Reply

Your email address will not be published.